కోడుమూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు..రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ఇవ్వలేదన్నారు అలాగే 18 సంవత్సరాలు పైనున్న మహిళలకు నెలకు 1500 రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నారు..నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు అన్నారు, అలాగే జాబ్ క్యాలెండర్ కూడా వదలడం లేదన్నారు.రాబోయే రోజులు మనకు మంచి రోజులు వస్తాయని, ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి తిరిగి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను బాబు షూరిటి మోసం గ్యారెంటీ గురించి ప్రతి ఒక్కరికి తెలపాలిని మనవి.అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అందరూ కష్టపడి పనిచేయాలన్నారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటి సభ్యులు, మరియు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కమిటి సభ్యులు , వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, కోడుమూరు నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కో కన్వీనర్, సోషల్ మీడియా అధ్యక్షులు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.