రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి కి ప్రతీక అయిన బోనాల పండుగ కు రాష్ట్రంలో ఎటువంటి ఆదాయం లేని దేవాలయాలకు ఆర్ధిక భరోసా కల్పించి బోనాల పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునే విధంగా తోడ్పాటు అందించే కార్యక్రమం లో భాగంగా ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 256 దేవాలయాలకు సుమారు 72 లక్షల రూపాయలను చెక్కుల ద్వారా మారేడ్ పల్లి లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై చెక్కుల పంపిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో, బోనాల పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే విధంగా సహాయ సహకారాలు అందిస్తుందని, బోనాల పండుగ అంటేనే లష్కర్ బోనాలు అని దేశవ్యాప్తంగా లష్కర్ బోనాలకు ప్రత్యేక స్థానం ఉందని,ఈ ఒరవడిని భావి తరాలు కూడా ముందుకు తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని,అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బోనాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు .ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం లో దేవాదాయశాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.