బండి ఆత్మకూరులో ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాలతో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సూచనతో శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో గౌరవ శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు హాజరయ్యారు.
అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజన్న మాట్లాడుతూ విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు కు బంగారు బాటలు వేయవచ్చని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు. నాణ్యమైన విద్య, యూనిఫాం, పుస్తకాలు, సన్న బియ్యంతో రోజుకో మెనుతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినట్లు అన్నారు. పాఠశాలలో విద్యార్థులు ఎలా చదువుతున్నారు అనే విషయమై తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు వివరించేందుకు ఈ ఆత్మీయ సమావేశంలో ప్రోగ్రెస్ రిపోర్టులు సైతం అందజేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగారని, భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లకు సీట్లు లేవు అని చెప్పే రోజులు వస్తాయని, అందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చర్యలు తీసుకున్నారని అన్నారు.