అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే శ్రీగణేష్

0
7

కంటోన్మెంట్ వార్డు 1 లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. బోయిన్ పల్లి ప్రాంతంలోని పవన్ విహార్ కాలనీ, నేతాజీ నగర్ ,చిన్నతోకట్ట,నక్కల బస్తీ లలో 60 లక్షల రూపాయలతో ఓపెన్ నాలా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నాలా పనులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే కాంట్రాక్టర్ కు పనులను వేగంగా చేయాలని సూచించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయిన దృష్ట్యా కాలనీవాసులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్న కాలనీల వాసులు నాలా, అండర్ గ్రౌండ్ నిర్మాణ పనులను చేపట్టడం పట్ల ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి భానుక నర్మద మల్లికార్జున్, బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.