కొంపల్లి జోన్ ,సుచిత్ర బ్రాంచ్ లో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో చెట్లను నాటి పచ్చదనం పట్ల అవగాహన కల్పించారు.విద్యార్థుల చేత ర్యాలీని నిర్వహించి మొక్కలు పెంచడం పట్ల అవగాహన కల్పించే విధంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏ.జీ.యం రమణారావు మాట్లాడుతూ ,మొక్కలను నాటి వాటిని సంరక్షించడమే మన భవిష్యత్తు తరం కోసం పెట్టె గొప్ప పెట్టుబడి అని అన్నారు. శ్రీ చైతన్య భావితరానికి స్ఫూర్తిగా మారుతుందని ఆయన ప్రశంసించారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని చెప్పారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొంపల్లి జోన్ ఏ.జీ.యం రమణారావు ,ఆర్.ఐ. చక్రి , కొంపల్లి జోన్ కోఆర్డినేటర్స్ రవి కుమార్ , బ్రాంచ్ ప్రిన్సిపల్ భావన ,అకడమిక్ డీన్ వెంకట్ , సి అండ్ ఐకాన్ ఇంచార్జ్ దుర్యోధనారావు పాల్గొన్నారు.