1813వ సంవత్సరంలో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సూరీటి అయ్యప్ప మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ టవర్‌కు బదిలీ అయ్యాడు. బదిలీ అయిన కొన్ని రోజులకు కలరా వ్యాధి సోకి వేలాది మంది మరణించారు. ఆ సమయంలో అయ్యప్ప అనుచరులు ఉజ్జయినీలో శ్రీ మహంకాళి దేవీని దర్శించి కలరా వ్యాధి నుండి కాపాడాలని, పరిస్థితులు అనుకూలించిన అనంతరం సికింద్రాబాద్‌లో విగ్రహా ప్రతిష్టచేయించి ఆలయం నిర్మిస్తామని ప్రార్థించారు. అనంతరం కలరా వ్యాధి నుండి వేలాది మంది రక్షింపబడ్డారు. అనంతరం సూరిటీ అయ్యప్ప వారి అనుచరులతో సికింద్రాబాద్ తిరిగి వచ్చిన తదుపరి 1815లో కట్టెతో అమ్మవారి విగ్రహన్ని చేయించి ప్రతిష్ఠచేసి నిత్యం పూజలు చేయుస్తున్నారు. 1864వ సంవత్సరంలో కట్టె విగ్రహం తీసివేసి ఇప్పుడు ఉన్న మహంకాళి, మాణిక్యాలదేవీ విగ్రహాలు ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేపట్టారు.