బస్తీ వాసులకు అండగా జీడి సంపత్ కుమార్ గౌడ్

0
1

మల్కాజిగిరి ముస్లిం బస్తివాసులు తమ బస్తి లో ప్రధానంగా నాలుగు సమస్యలు చాలా రోజులుగా ఎదుర్కొంటున్నారు. 01. నీటి బోర్ సమస్య 02. బస్తీలో సిసి రోడ్ సమస్య 03. అస్త వస్థంగా పెరిగిన చెట్ల సమస్య 04. మంచి నీటి సమస్య పై సమస్యల పరిష్కారానికై బస్తీ వాసులు మల్కాజిగిరి 140 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీడి సంపత్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకురవడంతో ఈరోజు డివిజన్ అధ్యక్షులు ముస్లిం బస్తీ సందర్శించి, బస్తీ వాసులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి తెలుసుకొని మైనంపల్లి హనుమంత రావు అన్న గారి చేరువతో సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఈ సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరడంతో అధికారులు సానుకూలంగా స్పందించి త్వరగా పనులు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గౌసూదిన్ భాయ్,శ్రీకాంత్ ముదిరాజ్, మక్బూల్ భాయ్, ఇక్బాల్ భాయ్,అసిమ్ పాల్గొనడం జరిగినది.