వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం వైసీపీ ప్రభుత్వమేనని సయ్యద్ గౌస్ మోహిద్దీన్

0
2

మార్కాపురం టౌన్ నందు బి కన్వెన్షన్ హాల్ నందు వైసిపి విస్తృత స్థాయి సమావేశం విజయవంతంలో ప్రకాశం జిల్లాలో వైసిపి మార్కాపురం నియోజకవర్గం ఇన్చార్జ్ అన్న రాంబాబు మరియు జిల్లా అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు శివ ప్రసాద్ రెడ్డి, గారి పాత్ర ఎంతో ఉందని వైసిపి నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం నాడు జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో అన్నా రాంబాబు కు మరియు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి శాలువాతో సన్మానించారు. ఈ విస్తృత స్థాయి సమావేశంతో నియోజకవర్గం లో నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల్లో నూతనో త్సాహం నింపారని సయ్యద్ గౌస్ మోహిద్దీన్ కొనియాడారు. నేటికీ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో గాని మార్కాపురం నియోజకవర్గంలో గాని వైసిపి ఎంతో పటిష్టంగా ఉందంటే దానికి కారణం జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ అన్నా రాంబాబు అని ఆయన పేర్కొన్నారు. అన్న రాంబాబు నాయకత్వంలో ఎన్నికలకు వైసీపీ మరింత పటిష్టమవుతుందన్నారు. నియోజకవర్గంలో వైసిపి చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఘనత అన్నా రాంబాబు గారి దేనని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, రాజకీయాలు చేసినా వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం వైసీపీ ప్రభుత్వమేనని సయ్యద్ గౌస్ మోహిద్దీన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి ప్రకాశం జిల్లా చైర్మన్ బూచేపల్లి శివ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ రాంబాబు , ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి మార్కాపురం మాజీ శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.