ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమం లో తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల పరస్పర దాడులు

0
81

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ లో ఆషాడ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం దేవాలయములకు ఆర్థిక సహకార చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు అతిథులకు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించి ఆశీర్వదించారు. ఆ తరువాత జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయం లో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ మొదయింది. వెంటనే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఈ ఘర్షణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. వెంటనే పోలీస్ లు ఇరువర్గాలను తమ అదుపులోకి తీసుకొని వారికి రక్షణ కలిగించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు పిర్యాదులు చేసుకున్నారు. ఉద్రిక్తల వలన ఆగిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు కొనసాగించారు.