వర్షంతో ఇబ్బందులు పడుతున్న బస్తీ వాసులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
14

మల్కాజిగిరి జిల్లా/ కంటోన్మెంట్ 

 

ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి బస్తీలు కాలనీల లోకి వర్షపు నీరు చేరి ఇళ్ళలోకి కూడా రావడంతో ఆయా బస్తీ, కాలనీల వాసులు తీవ్ర ఇక్కట్లకు గురి అయ్యారు. ఇళ్ళలోకి నీళ్ళు వచ్చిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీగణేష్ కార్ఖానా లోని నారాయణ స్వామి టెంపుల్ ఏరియాలో పర్యటించి అక్కడి ప్రజలను పరామర్శించారు.ఇళ్ళలోకి నీరు చేరడంతో ఇళ్ళలోని వస్తువులు నీట మునిగాయి.స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి తక్షణమే అక్కడికి పిలిపించుకుని ఇళ్ళలోకి వచ్చిన నీటిని బయటకు పంపించాలని, వారికి అవసరమైన సహాయాన్ని వెంటనే అందించాలని,ఏ అవసరం వచ్చినా నాకు సమాచారం ఇస్తే వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటానని, ఎలక్ట్రిసిటీ, శానిటేషన్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అధికారులకు సూచించారు.తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు బస్తీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.