అభ్యస స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

0
2

మల్కాజ్గిరి,మేడ్చల్ జిల్లా/అల్వాల్

 

బోనాల పండుగ సందర్భంగా అల్వాల్ లోని అభ్యాస జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో బోనాలతో కళాశాల నుండి మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ఉన్నటువంటి ఉప్పలమ్మ దేవాలయం కు వచ్చి బోనం నైవేద్యం సమర్పించారు.

ఈ సందర్భంగా పోతురాజుల నృత్యాలు ,విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. 

ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు కళాశాల యాజమాన్యం మహేందర్ గౌడ్ , విశాల్ , స్వామి గౌడ్ , పూర్ణచందర్ గౌడ్, వినీత్ పాల్గొన్నారు.

-sidhumaroju