నేను ఏ పార్టీ లోకి వెళ్ళను : ఎమ్మెల్యేరాజాసింగ్

0
21

 

 

 హైదరాబాద్/ గోషామహల్.

 

ఇటీవల జరిగిన భాజపా పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక పట్ల అసంతృప్తి పడ్డ జాబితాలో రాజాసింగ్  ఒకరు. ఆయన తన అసంతృప్తిని బహిరంగంగా వెల్లడిస్తూ కొద్దిరోజుల క్రితం బిజెపి పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజాసింగ్ బిజెపి పార్టీకి చేసిన రాజీనామాను పార్టీ అధిష్టానం ఆమోదించింది. కానీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బిజెపి ఆమోదించలేదు. సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ.. గోషామహల్ అంటే భారతీయ జనతా పార్టీ అడ్డా అని రాజాసింగ్ అన్నారు. బీజేపీ అధిష్టానం తనపై  ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పదవికీ తనను బీజేపీ రాజీనామా చేయమని ఆదేశిస్తే  చేస్తానని అయన పేర్కొన్నారు. 

-సిద్దుమారోజు.