పలు ఆలయాలను సందర్శించుకున్న కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్

0
30

మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్

బోనాల పర్వదినాన్ని పురస్కరించుకొని మచ్చబొల్లారం, హరిజన బస్తీ, బోడ్రాయి, అలాగే ప్రముఖ “ఏడు గుళ్ళు” సహా 133 డివిజన్ లోని పలు ఆలయాలను కార్పొరేటర్ జితేంద్రనాథ్  దర్శించుకున్నారు. ఈ సందర్బంగా  అయన అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ప్రజల  ఆరోగ్యం, సుఖసంతోషాలు మరియు శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీల సభ్యులు, కాలనీ సంఘాల ప్రతినిధులు మరియు భక్తులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ మాట్లాడుతూ… ఇలాంటి పండుగలు మన సంస్కృతి గొప్పదనాన్ని తెలియజేస్తాయి.  మనం కలిసి ఎదుగాలని గుర్తు చేస్తాయి. బోనాల పండుగ సందర్భంగా  అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు  తెలియజేస్తున్నాను. అమ్మవారి దీవెనలు మనపై ఉంచి,  మనందరినీ శాంతి, ఐక్యత మరియు అభివృద్ధి మార్గంలో నడిపించాలని అమ్మ వారిని కోరుకున్నట్టు తెలియజేశారు.

-సిద్దుమారోజు