హైదరాబాద్ జిల్లా/కాచిగూడ.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, హైదరాబాద్ (కాచిగూడ రైల్వే స్టేషన్) నుండి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ (భగవతి కి కోటి రైల్వే స్టేషన్)కు… ఈ రోజున మొదటి రోజువారీ రైలు సర్వీసును ప్రారంభించారు. దీనివల్ల హైదరాబాద్‌లో సంవత్సరాలుగా స్థిరపడిన రాజస్థానీ సమాజ సభ్యుల నుండి అనేక విజ్ఞప్తులు అందాయి. వారి దీర్ఘకాల అభ్యర్థన మేరకు, గౌరవ రైల్వే మంత్రి ఈ విజ్ఞప్తి నీ త్వరగా ఆమోదించారు… ఈ కొత్త రోజువారీ రైలు రాజస్థానీ సమాజానికే కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు రాజస్థాన్‌లకు ప్రయాణించే ప్రయాణికులకు కూడా పెద్ద ఉపశమనం కలిగిస్తుంది….ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణలో రైలు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, స్టేషన్లను పునరుద్ధరించడానికి, రికార్డు బడ్జెట్‌లను కేటాయించడానికి మరియు రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచడానికి కట్టుబడి ఉంది. ఈ కార్యక్రమంలో మహంకాళి, జిల్లా బీజేపీ అధ్యక్షులు, భరత్ గౌడ్, దిశా కమిటీ సభ్యురాలు శారదా మల్లేష్ , నరసింహ. పాల్గొన్నారు.
Sidhumaroju