హైదరాబాద్/సికింద్రాబాద్.
ఆషాడ మాస లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం లోని చిలకలగూడ రైల్వే క్వాటర్స్ లోని మావిరాల రేణుక ఎల్లమ్మ దేవాలయం లో పూజలు నిర్వహించడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దిశా కమిటీ సభ్యురాలు శ్రీమతి శారదా మల్లేష్, ఆలయ కమిటీ చైర్మన్ దంపతులు కే.బాబురావు శ్రీమతి శోభ, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆదర్శ్ కుమార్ పాల్గొన్నారు. హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆషాఢం మాస బోనాల పూజ సందర్భంగా.. ఏర్పాటుచేసిన భోజన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.
తార్నాక డివిజన్లో లాలాపేట్, సాయినగర్ లోని గ్రామ దేవత మైసమ్మ, ఎల్లమ్మ తల్లుల పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా దేవాలయం కమిటీ సభ్యులు ఆంజనేయులు, నర్సింగ్ రావు, సంజీవ్, పద్మా రాజమ్మ, రవి, బ్రహ్మం, కేశవ, మధు, శాలవాలతో సత్కారం చేశారు.
లాలాపేట్ లోని ముత్యాలమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది .
ఈ సందర్భంగా దేవాలయం కమిటీ చైర్మన్ బండి మహేష్, కమిటీ సభ్యులు శాలువాల తో సత్కరించారు.
శాంతినగర్ లోని అంబేడ్కర్ నగర్ లో నల్ల పోచమ్మ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దేవాలయ కమిటీ సభ్యులు సాయి కుమార్ ఈశ్వర్, జగదీష్, జనార్ధన్, రాజు, జై భీమ్, రామ్ చందర్, సుధాకర్, మల్లేష్ లు అథితులను సత్కరించారు.
-Sidhumaroju