ఫిష్ వెంకట్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు

0
6

సికింద్రాబాద్/అడ్డగుట్ట

 

సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చాలా బాధాకరమని మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఫిష్ వెంకట్ శనివారం మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ లు అడ్డగుట్ట లోని వారి నివాసానికి వెళ్లి వెంకట్ పార్ధీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వెంకట్ మంచి నటుడు అని, అనేక చిత్రాలలో తన నటనతో ప్రేక్షకుల అభిమానం పొందారని అన్నారు. సినీ ఇండస్ట్రీలో ని అందరికి నాలుకలా ఉండేవాడని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధించారు.

Sidhumaroju