మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/కౌకూర్.
బోనాలు తెలంగాణ లో జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ. ఇది ప్రధానంగా మహంకాళి అమ్మవారికి అంకితం చేయబడింది. బోనాల పండుగలో ఘటం ఊరేగింపు కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రత్యేమైన కలశం. దీనిని వూరేగింపుగా అమ్మవారి వద్దకు తీసుకెళతారు. ఈ వూరేగింపుతో మొదటి రోజు బోనాల సమర్పణ ద్వారా ముగుస్తుంది. మరుసటి రోజున రగం అనే కార్యక్రమం జరుగుతుంది.ఒక స్త్రీ మహంకాళి దేవతను తనపైకి ఆహ్వానించి భవిష్యవాణి చెపుతుంది. పోతరాజు అమ్మవార్లకు తమ్ముడు అంటారు. అతను ఈ పండుగలో ఆనందంగా ప్రతేక ఆకర్షణగా నిలుస్తాడు. ఈ పండుగలోఅనేక ఇతర సాంప్రదాయాలు..ఒగ్గు కథ, పాలబండి, గుర్రపు బగ్గి, పోతరాజు విన్యాసాలు భక్తులలో భక్తి పారవస్యాలు నింపుతాయి. ఈ పండుగను పురస్కరించుకొని కౌకూరులో జరిగిన బోనాల పండగ కార్యక్రమానికి ఆల్వాల్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరిపై అమ్మవారి కరుణాకటాక్షాలు వుంటాయని అయన తెలియచేసారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్ష్మి కాంత్ రెడ్డి, పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. జెకె కాలనీ జనరల్ సెక్రెటరీ ప్రదీప్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీశైలం యాదవ్, సర్వేష్ యాదవ్, దిండ్లస్వామి, వి.వి.రావు, దేవేందర్, స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-సిద్దుమారోజు ✍️