గూడూరు ఎమ్మార్వో కార్యాలయ నిర్మాణం జరిగేనా,,,
మండలం లోని ఎమ్మార్వో కార్యాలయం శిథిలమై దాదాపు 13 సంవత్సరాలు గడిచిన పట్టించుకోలేని నాయకులు, అధికారులు మారిన ఎమ్మార్వో కార్యాలయం నిర్మాణం కాలేదు,
మరి గూడూరు మండలం సమస్యలకు నిలయంగా మారింది. గూడూరు పట్టణంలోని నడిబొడ్డులో తహసీల్దార్, సబ్ ట్రెజరీ, కార్యాలయాలున్నాయి. గూడూరు రెవెన్యూ పరిధిలో గల అన్ని గ్రామాలకు చెందిన వేల మంది ప్రజలు, రైతులు నిత్యం సమస్యలతో గూడూరు ఎమ్మార్వో కార్యాలయానికి వస్తున్నారు, కానీ గూడూరు ఎమ్మార్వో కు సొంత భవనం లేకపోవడంతో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో నిర్మించిన భవనంలో ఎమ్మార్వో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు,
40 ఏళ్ల కిత్రం గూడూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని నిర్మించారు, నిర్మించిన ఎమ్మార్వో కార్యాలయం పూర్తిగా కూలి పోయింది, గత ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ నూతన ఎమ్మార్వో ఆఫీస్ నిర్మాణం చేపడతానని చెప్పిన అది నెరవేరలేదు, మరి ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హయాంలో అయినా నిర్మాణం జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు, గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రస్తుతం బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన భవనం తడిసి పైకప్పు నుంచి నీళ్లు కారుతున్నాయి. వర్షపు నీరు పైకప్పు నుంచి కారడంతో ఎమ్మార్వో కార్యాలయంలో రికార్డుల రూములో నిల్వఉన్న పత్రాలపై వర్షపు నీళ్ళు పడి తడిసిపోతున్నాయని, సొంత భవనం లేకపోవడంతో రికార్డులు పూర్తిగా ధ్వంసం అయ్యే పరిస్థితి నెలకొందని . ఇకనైనా కలెక్టర్ గారు, మరి నాయకులు నూతన ఎమ్మార్వో ఆఫీస్ నిర్మాణం చేపట్టాలని ప్రజలు, రైతులు ఆశిస్తున్నారు