ఫ్రిజ్లో పెట్టిన మటన్ తిని అస్వస్థకు గురైన కుటుంబం

0
1

మటన్ తిని ఒకరి మృతి.. ఏడుగురికి సీరియస్ HYD వనస్థలిపురంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫ్రిజ్లో నిల్వ చేసిన మటన్ తిని ఒకే కుటుంబానికి చెందిన 8మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆర్టీసీ కండక్టర్ శ్రీనివాస్ చికిత్స పొందుతూ మరణించారు. స్థానిక RTC కాలనీకి చెందిన కుటుంబం ఆదివారం బోనాల సందర్భంగా మటన్ వండుకుని తిన్నారు. మిగిలిన దాన్ని ఫ్రిజ్లో పెట్టారు. దాన్ని ఇవాళ తినడంతో ఫుడ్ పాయిజన్ అయింది. మిగతా ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.