ఘనంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు.

0
18

సికింద్రాబాద్ / బన్సిలాల్ పేట్.  

సికింద్రాబాద్.   కేటీఆర్ జన్మదిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఫ్లెక్సీలను తొలగించినంత మాత్రాన ప్రజల హృదయాల నుండి కేటీఆర్ ను దూరం చేయలేరని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.బన్సీలాల్ పేట్ సెయింట్ ఫెలోమినా పాఠశాలలో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్,మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు విద్యార్థులకు సైకిళ్ళను, పాఠశాల తరగతి సామాగ్రిని పంపిణీ చేశారు. మున్సిపల్ మంత్రిగా సేవలందించి హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్ కు దక్కుతుందని అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా కేటీఆర్ గర్భిణీ స్త్రీలకు ఉచితంగా వైద్య కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లెక్సీలను తొలగించడం సరికాదని ఫ్లెక్సీలను తొలగించాలని తామనుకుంటే గత పది ఏళ్లలో కాంగ్రెస్ జెండా కనబడేది కాదని అన్నారు.

 

-SIDHUMAROJU ✍️