లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అధికారులకు దిశా నిర్దేశం చేసిన కలెక్టర్

0
4

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జిల్లాలో ని తమ తమ మండల ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాలలోని స్లమ్స్ ఏరియాలను గుర్తించి అక్కడ చిన్న చిన్న ఇళ్లలో ఉండే వారిని గుర్తించి ప్రభుత్వప జి ప్లస్ 3,4 అంతస్తులలో పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు వారిని ఒప్పించేందుకు తహాసీల్దార్లు చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టరు మను చౌదని తహాసీల్దార్లను ఆదేశించారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ విసి హాల్ లో జిల్లా అదనపు కలెక్టర్లు రాధికగుప్తా, విజయేందర్ రెడ్డిలతో జిల్లా కలెక్టరు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను కాపాడాల, భూదాన్ ల్యాండ్ లను గుర్తించి లిస్టు పంపాలని తహాసీల్దార్లకు, మున్సిపల్ కమీషనర్లకు సూచిరాచారు. స్లమ్స్ ను అభివృద్ధి చేయాలని అక్కడ అవసరమైన కనీస వసతులను ఏర్పాటు చేయాలని కలెక్టరు ఆదేశించారు. ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలో కేటాయించిన లబ్దిదారులే ఉంటున్నారా, లబ్దిదారులు కాకుండా వేరే వాళ్లు ఉంటున్నారా, కేటాయించిన ఇళ్లను అద్దెకు ఇచ్చినారా అనే అంశాలను గుర్తించి నివేదిక అందించాలని, అవసరమైన చోట నోటీసులు జారీ చేయాలని కలెక్టరు ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఒక బృందంగా ఏర్పడి క్ష్టేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు పంపాలన్నారు. భూభారతి లో భాగం రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పై సమీక్షి నిర్వహించి ఎన్ని దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి, వాటి తగు చర్యలు తీసుకోవాలని, అవసరవైన వారికి నోటీసులు జారీ చేయాలని కలెక్టరు ఆదేశించారు. వర్షాకాలంలో తీసుకోవలసిన చర్యల పై కలెక్టరు మాట్లాడుతూ ఎక్కడ వర్షపు నీళ్లు నిలువ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షపు నీరు నిలువ ఉండే స్థలాలను గుర్తించి నిరంతరం మానిటర్ చేయాలన్నారు. సంబంధిత మెడికల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకుంటూ ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించేలా చూడాలన్నారు. ఆర్బిఎస్కె బృందాలు హాస్టల్స్ ఇనిస్టిట్యూట్స్, స్కూలు వెళుతున్నారా అని తెలుసుకోవాలన్నారు. రేషన్ కార్డులు ఎక్కువ సంఖ్యలో పెండింగ్ లో ఉన్న చోట డిఎస్ఓ తో సమన్వయం చేసుకుంటూ అవసరమైతే అదనపు లాగిన్ ఐడిలు తీసుకొని పెండింగ్ ను క్లియర్ చేయాలన్నారు. కొత్త మున్సిపాలిటీలలో ప్రజల అవసరాల నిమిత్తం ఏమైన ప్రతిపాదనలు ఉంటే తనకు నివేదికలు పంపాలననారు. నీర్ణీత ప్రొఫార్మాలలో కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను పొందుపస్తూ లిస్టులను తనకు పంపాలన్నారు. భారీ వర్షాల సందర్భంగా స్కూల్స్, గ్రామ పంచాయతీలు, కాలేజీలు, మండల భవనాలను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని శిథిలావస్థలో ఉన్న ఇళ్లను, నిర్మాణాలను ముందుగా గుర్తించి అక్కడ ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో మిడ్ డే మీల్స్, వంట సామాగ్రిని తరచుగా పరిశీలించాలని, విద్యార్థులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని, ఏలాంటి సమస్యలు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఒ హరిప్రియ, ఆర్డిఓలు ఉపేందర్ రెడ్డి, శ్యాంప్రకాష్, లా ఆఫీసర్ చంద్రావతి, తహాసీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

 భారత్ ఆవాజ్ రిపోర్టర్ వి ఏ చారి