తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో

0
1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కి చెందిన ఇద్దరు డిఎస్పీ లు మృతి చెందడం పై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు…పార్లమెంట్ సమావేశలలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ గారు ఒక ప్రకటన ద్వారా మృతులకు సంతాపం తెలిపారు…ఓ కేసు విషయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డిఎస్పీ లు చక్రదర్ రావు, శాంతారావు లు రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు.. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు…ఇక ప్రమాదం లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తునానన్న ఎంపీ నాగరాజు గారు , మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు…