పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ :

0
9

సికింద్రాబాద్/సికింద్రాబాద్.

సికింద్రాబాద్..   కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ పై విజయకేతనం ఎగురవేసి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పరేడ్ మైదానంలో అమరవీరుల స్థూపానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ విజయ్ దివాస్ పేరిట పరేడ్ మైదానంలోని అమరవీరుల స్థూపానికి మాజీ సైనిక అధికారులు విశ్రాంత సైనికులు నివాళులు అర్పించారు. సర్వమత ప్రార్థన నిర్వహించి అందరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. నెలల తరబడి వీరోచితంగా పోరాడి భారతదేశ పతాకాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. భారత్ లోకి ప్రవేశించాలనుకున్న పార్కు మూకల చొరబాటును సమర్థవంతంగా తిప్పికొట్టి భారత సైన్యం సత్తా చాటిందని గుర్తు చేసుకున్నారు.

-సిద్దుమారోజు ✍️