కోడుమూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో పేదల జీవితాలతో ఆడుకుకుంటునాన్నాయని, సెల్ ఫోన్ లో రీచార్జ్ ఉంటేనే సెల్ పనిచేస్తుంది. అదేవిధంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ లో రీఛార్జ్ ఉంటేనే కరెంట్ వాడే విదంగా అదాని కంపినికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయని, ఈ అగ్రిమెంట్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే విరమించుకోవాలని లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అడ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెపడతామణి సి పి ఐ నాయకులు హెచ్చరించారు. శనివారం స్థానిక విద్యుత్ కార్యాలయం ముందు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో సి పి ఐ నాయకులు రాజు, శేషు కుమార్, దూల్ల భాస్కర్, చిన్నరాముడు,సులోచనమ్మ, ఢిల్లీ వెంకటేష్, రుక్మాన్, మస్తాన్, రంగడు, బాబురావు, జంగాల దస్తగిరి, శ్రీకాంత్, విజయ్,ఏడుకొండలు, వెంకటస్వామి, మద్దిలేటి, మాల శ్రీనివాసులు,నాగరాజు యాదవ్,హు స్సేన్, గౌడ్, తదితరులు పాల్గొన్నారు.