మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్.
అల్వాల్ సర్కిల్ సాయిబాబా నగర్ కాలనీ నుండి లయోలా కాలేజ్ దారిపై గత పది రోజులుగా డ్రైనేజ్ నీరు పొంగిపొర్లుతూ వస్తోంది. దీనివల్ల అక్కడి విద్యార్థులు, పాదచారులు, వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుచున్నారు.
—సిద్దుమారోజు