మేడ్చల్ మల్కాజ్గిరి /ఆల్వాల్.
సామాజిక సేవలో తనదైన రీతిలో ముందుకెళుతూ అందరి మన్ననలు పొందుతున్న ఆల్వాల్ కు చెందిన నర్ల సురేష్ ను గౌరవ డాక్టరేట్ వరించింది. ఈమేరకు తమిళనాడులోని హోసూర్ నగరంలో శనివారం ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ, రియల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నర్ల సురేష్ కు డాక్టరేట్ సర్టిఫికెట్ తో పాటుగా ప్రశంసా పత్రాన్ని నిర్వాహకులు అందజేశారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబర్చిన వారితో పాటుగా సామాజికంగా సేవలు చేస్తున్నటువంటి సేవలను గుర్తిస్తూ డాక్టరేట్ ప్రదానం చేయడం జరుగిందని మచ్చబొల్లారం కేంద్రంగా వున్న సురేష్ సేవా సమితి వ్యవస్థాపక నిర్వాహకులు, చైర్మన్ నర్ల సురేష్ తెలిపారు. అల్వాల్ సర్కిల్ ల్లో గత 25 సంవత్సరాలుగా సామాజికంగా, రాజకీయంగా వివిధ రకాల సేవలను అందజేస్తున్నారు. ముఖ్యంగా పేదల అభ్యున్నతికి గాను సురేష్ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు ఇట్టి ప్రొత్సహకాలు ఎంతగానో ఉపయోగ పడతాయన్నారు. భవిష్యత్తు లో సురేష్ సేవా సమితి మరింత పటిష్టంగా సామాజిక కార్యక్రమాలను రూపొందించుకుంటూ ముందుకెళుతుందని సురేష్ వివరించారు.
-సిద్దుమారోజు. ✍️