అల్వాల్ అంజనాపురి కాలనీలో భారీ చోరీ.

0
18

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్

అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిమ్మప్ప తెలిపిన వివరాల ప్రకారం,  నిన్న మధ్య రాత్రి తేదీ 28 రోజున ఆల్వాల్ పి.ఎస్. పరిధిలోని అంజనాపురి కాలనీ, మచ్చబొల్లారంలో తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉంచిన 26 తులాలు బంగారు ఆభరణాలు, 2.5 తులాల వెండి నగలు మరియు 20 వేల రూపాయల నగదును దొంగతనం చేశారు. ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. క్లూస్ టీమ్ మరియు సీనియర్ అధికారులు నేర స్థలాన్ని పరిశీలంచడమైనది. సీసీ కెమెరాల ద్వారా గుర్తించి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అయన తెలియ చేశారు. 

  -సిద్దుమారోజు