ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

0
22

మల్కాజిగిరి/ఆల్వాల్

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు యాదమ్మ నగర్‌లో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ , జిల్లా సభ్యులు శరణగిరి ఆధ్వర్యం  వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న బస్తీవాసులు తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. ముఖ్యంగా,కరెంట్ మీటర్లు ఏర్పాటు చేయడం. ప్రభుత్వ పాఠశాలలో అదనపు గది నిర్మాణం. తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు. యుజిడి రీమోడలింగ్ పనులు చేపట్టాలని కోరారు.ఈ సమావేశంలో కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్, తహసిల్దార్  రాములు,డిప్యూటీ తహసిల్దార్ , ఎస్‌.ఐ. మల్లేశ్, సివిల్ సప్లై అధికారి దినేష్,ఏ ఎస్ డి ఓ , ఆర్ ఐ.రమ్యశ్రీ, బస్తీవాసులు మరియు తదితరులు పాల్గొన్నారు.