మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / అల్వాల్
అల్వాల్ డివిజన్ మచ్చబొల్లారం సాయి రెడ్డి నగర్ లోని విద్యుత్ దీపాలు వెలగడం లేదని భారత్ అవాజ్ వార్తకు తక్షణమే డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ స్పందించారు.ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి, వీధి దీపాల సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. సమస్య పరిష్కారమవడంతో సాయి రెడ్డి కాలనీ వాసులు భారత్ ఆవాస్ కు, కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మా సమస్యను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని కాలనీ ప్రజలు పేర్కొన్నారు.
-సిద్దుమారోజు