శ్రీకాకుళం, జూలై 31: జిల్లాలో తీరప్రాంతాలైన బారువ, కళింగపట్నం, బావనపాడు తదితర తీర ప్రాంతాల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు ఆదేశించారు. గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అధ్యక్షతన, జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి గారు, జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారు లతో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రధానంగా మత్స్యకారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు తీసుకోవాలని, సముద్రంలో పని చేసే ప్రతి మత్స్యకారుడు భద్రతతో కూడిన లైఫ్ జాకెట్ విధిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని పలు అంశాలు పైన అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మెరైన్ ఎ.ఎస్పీ, ఇండియన్ నేవీ స్టాప్ ఆఫీసర్ ఆదిత్య పాండే, డిఆర్ఓ ఎం.వెంకటేశ్వర రావు, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష, విపత్తుల నిర్వహణ శాఖ డిపిఎం రాము, మత్స్య శాఖ డిడి సత్యనారాయణ, పోలీస్, వివిధ శాఖల ఆధిపతులు తదితరులు పాల్గొన్నారు.