సికింద్రాబాద్/ కంటోన్మెంట్.
రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.సికింద్రాబాద్ నియోజకవర్గంలో అర్హులైన పేద ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, కలెక్టర్ హరిచందన చేతుల మీదుగా రేషన్ కార్డులను పంపిణీ చేశారు.అర్హులైన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులను అందచేస్తు చేయుత అందిస్తున్నట్లు వెల్లడించారు.కంటోన్మెంట్ లోని 1800 మందికి రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని అన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక ప్రజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజా ప్రభుత్వం గా కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నట్లు తెలిపారు.గత ప్రభుత్వంలో ఉప ఎన్నికలు, ఎన్నికల సమయంలోనే ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత ఉండేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడమే మా ధ్యేయమని అన్నారు.ఆషాడ మాసంలో బోనాల పండుగ సంబరాలు జరిగితే శ్రావణమాసంలో రేషన్ కార్డుల సంబరాలు జరుగుతున్నాయన్నారు. సన్న బియ్యం పంపిణీ తో పాటు సన్నవడ్లకు 500 బోనస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి అనేక పథకాలతో పాటు రైతు భరోసా కింద రైతులకు ₹9,000 కోట్ల రూపాయలు జమ చేసి రైతు రుణమాఫీ చేసి, 60000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకొచ్చారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం బిఆర్ఎస్ కార్పొరేటర్ రాసూరి సునీతకు ఆదం సంతోష్ కుమార్ స్వల్ప వాగ్వాదం జరిగింది.బిఆర్ఎస్ కార్పొరేటర్లను అవమానపరిచేలా ఆదం సంతోష్ మాట్లాడారని చెప్పడంతో ఆయన తానేమి అలా మాట్లాడలేదని చెప్పడంతో అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పి పంపారు.
–సిద్దుమారోజు