గూడూరు ): అన్నదాత సుఖీభవ పియం కిసాన్తో రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని

0
1

అన్నదాత సుఖీభవ పియం కిసాన్తో రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని కోడుమూరు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. శనివారం గూడూరులో కోడుమూరు నియోజక వర్గ స్థాయి అన్నదాత సుఖీభవ – పియం కిసాన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జాయింట్ కలెక్టర్ బి. నవ్య ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే తమ కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు అహర్నిశలు పని చేస్తున్నారన్నారు. సూపర్సెక్స్ పధకాలలో భాగంగా అన్నదాత సుకీభవ పథకం కింద రైతులకు సంవత్సరా నికి రూ.20వేలు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా పని చేసే చంద్రబాబు నాయుడును, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. జాయింట్ కలెక్టర్ బి. నవ్య మాట్లాడుతూ రైతుల స్థిర ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై వివరించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సందీప్ కుమార్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కె రామాంజనేయులు, సింగిల్ విండో అధ్యక్షుడు బి దానమయ్య, డైరెక్టర్ రేవట వెంకటేష్, టీడీపీ నాయకుడు సృజన్, కౌన్సిలర్లు కోడుమూరు షాషావళి, బుడ్డంగలి, టీడీపీ నాయకులు పౌలు, తెలుగు శ్రీను, నాగప్పయాదవ్, చాంద్ బాష, సుమన్బాబు, ఏడీఏ సాలు రెడ్డి, ఏవొలు దస్తగిరి రెడ్డి, మల్లేష్ యాదవ్, రవి ప్రకాష్, రూఫస్ రోనాల్, శ్రీవరన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.