గూడూరు నగర పంచాయతీని అభివృద్ధి అయినా చేయండి లేదా నగర పంచాయతీని రద్దయినా చేయండని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేవీ నారాయణ

0
3

గూడూరులో సిపిఎం ప్రాంతీయ కమిటీ సమావేశం జరిగింది, సమావేశంలో

 సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేవి నారాయణ, మాట్లాడుతూ……

గూడూరు మేజర్ పంచాయతీ నుండి నగర పంచాయతీగా ఏర్పడి 14 సంవత్సరాలు అయిందని, నగర పంచాయతీగా అయ్యిందే గాని ప్రజలపై పన్నుల భారాలే తప్ప అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదని, గూడూరును నగర పంచాయతీ చేయడంతో ఉపాధి హామీ పథకం రద్దయిందని, 

 80 శాతం పేద ప్రజలు ఉన్న గూడూరులో ఉపాధి హామీ పథకం రద్దు కావడంతో వ్యవసాయ పనులు లేని సమయంలో సుదూర ప్రాంతాలకు వలస వెళుతున్నారని, 54 కోట్ల నిధులతో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం ప్రారంభించి మధ్యలో నిలిచిపోయాయాని,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన కూడా ఆ ట్యాంకుల నిర్మాణం గురించి పట్టించుకోవడంలేదని, డ్రైనేజీ ట్రాఫిక్ సమస్యలతో గూడూరు పట్టణం ఉన్నదని,పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెతగా గూడూరు పట్టణ పరిస్థితి నెలకొన్నదని,సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామని సుపరిపాలన పేరుతో కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తుందే తప్ప ఇప్పటిదాకా ఎన్ని సిక్స్ లు కొట్టిందో చెప్పాలని, కూటమి ప్రభుత్వానికి గూడూరు పై చిత్తశుద్ధి ఉంటే గూడూరు పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపించాలని, లేదా నగర పంచాయతీగా రద్దుచేసి ప్రజలపై పన్నుల భారాలు తగ్గించాలని లేనిపక్షంలో గూడూరు పట్టణంలోని ప్రజలందరినీ ఏకం చేసి నగర పంచాయతీ అభివృద్ధి కొరకు పోరాటాలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు,,, కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి జే, మోహన్, ప్రాంతీయ కమిటీ సభ్యులు రాజశేఖర్, వెంకటేశ్వర్లు, రవి, కోటేశ్వరయ్య, బెలగల్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు,