ఘనంగా సౌందర్యలహరి లలిత పారాయణ వరలక్ష్మి వ్రత పూజ

0
56

 

 

 హైదరాబాద్/బాకారం.   

 

 

బాకారం ముషీరాబాద్ లోని తన స్వగృహంలో బిజెపి జాతీయ సీనియర్ నాయకులు కైలాస్ రామచందర్ గుప్తా శ్రీమతిస్వరూప రాణి దంపతుల స్వగృహంలో.. ప్రముఖుల ఆధ్వర్యంలో సౌందర్యలహరి లలితా సహస్రనామ పారాయణం మరియు వరలక్ష్మీ వ్రత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా : బుగ్గారపు దయానంద్ గుప్తా ఎమ్మెల్సీ. …బిజెపి రాష్ట్ర నాయకుడు, గో సంరక్షకుడు చీకోటి ప్రవీణ్. భారతి యోగానంద సంస్థ గురువు సరోజ రామారావు. శ్రీమంతుడు పార్టీ అధ్యక్షుడు నర్సాపూర్ శ్రీధర్ గుప్తా. వాసవి హాస్పిటల్ సంస్థల చైర్మన్ కొత్తూరి జయప్రకాష్. అపార్ట్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ వేణుగోపాల్, సెక్రటరీ సత్యనారాయణ పాల్గొన్నారు.

కార్యక్రమ అనంతరం చికోటి ప్రవీణ్ గో సంరక్షకులు రాష్ట్ర బిజెపి నాయకులు మాట్లాడుతూ.. ప్రతి కమ్యూనిటీలో ఐకమత్యం కనబడుతుంది కానీ మన హిందువుల దగ్గరికి వచ్చేసరికి మనలో ఐకమత్యం లేకపోవడం వలన హిందూ దేవాలయాలపై హిందువులపై అలాగే గోవులపై దాలుడు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఐకమత్యంగా ఒకటై పోరాడి మన హిందూ మతాన్ని ముఖ్యంగా మహిళలు శ్రావణమాసంలో వ్రతాధి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించి అమ్మవారి ఆశీస్సులతో మహిళా శక్తి బలపడి హిందూ ధర్మాన్ని మహిళలు మన హైందవ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని చికోటి ప్రవీణ్ గారు పిలుపునిచ్చారు.

బిజెపి జాతీయ సీనియర్ నాయకులు కైలాస్ రామచందర్ గుప్తా మాట్లాడుతూ ఈ వ్రతం చేయడానికి ముఖ్య కారణం రాష్ట్రము దేశము లోని ప్రజలు బాగుండాలి. భారతీయ జనతా పార్టీ పై అమ్మవారి ఆశీస్సులు కలగాలని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. హిందూ దేవాలయాలపై దాడులను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ని మహిళా శక్తి సంఘటితమై కదలి మద్యపానాన్ని పూర్తిగా నిషేధాన్ని అమలు పరిచే విధంగా ముందుకు కదలాలని మాట్లాడడం జరిగింది.

 

శ్రీమంతుడు పార్టీ నర్సాపూర్ శ్రీధర్ గుప్తా గారు మాట్లాడుతూ.. హిందువులపై హిందూ దేవాలయాలపై దాడి చేయడం అమానుషం హిందువులందరూ ఐకమత్యంగా ముందుకు కదిలి ఇలాంటి దాడులను మరొకసారి పునరావృతం కాకుండా హిందూ బంధువులు అందర్నీ సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు.

అపార్ట్మెంట్ కమిటీ అధ్యక్షులు వేణుగోపాల్, జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ కైలాస్ రామచంద్ర గుప్తా గారి స్వగృహంలో వరలక్ష్మి వ్రత కార్యక్రమం అందరికీ యోగక్షేమాల కోసం సౌందర్యలహరి లలితా పారాయణం కార్యక్రమం జరపడం ఆనందకరం అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్ ఓనర్స్ తరఫున కృతజ్ఞతలు కమిటీ ద్వారా తెలిపారు.

 

-సిద్దుమారోజు