హైదరాబాద్/ హైదరాబాద్
నిరుద్యోగులకు మరోసారి శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఐఏఎఫ్(IAF) లో అగ్నివీర్ నియామకాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఆగష్టు 4 వరకు అగ్నివీర్ నియామకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. అయితే అగ్నివీర్ దరఖాస్తుల గడువు జులై 31 తోనే ముగియగా.. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 4 వరకు దరఖాస్తు గడువును పెంచే నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు అధికారులు.
02-07-2005 నుంచి 02-01-2009 మధ్య జన్మించిన అవివాహితులు ఈ దరఖాస్తులకు అర్హులు. 10+2 లేదా 10+డిప్లొమా, ఇంటర్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ తోపాటు మొత్తం 50% మార్కులు పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
–సిద్దుమారోజు