‘దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్’ లో జరిగిన స్నేహితుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు

0
5

సికింద్రాబాద్/ బేగంపేట్.

బేగంపేట్ లోని ‘దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్ హైదరాబాద్’ లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, హాజరై అంధుల కోసం ఏర్పాటుచేసిన విద్యాలయాన్ని సందర్శించి వ్యవస్థాపకులు సాయిబాబాగౌడ్ జ్యోతిలను అభినందించారు. అలాగే హనుమాన్ చాలీసా మల్కాజ్గిరి భక్తమండలి నిర్వహకులు ఫణి బృందం, నాగేశ్వరరావు, శివకృష్ణ, రాకేష్, పలువురు పిల్లలలో భక్తి భావం పెంపొందించి ఆత్మస్థైర్యం నెలకొల్పడం గొప్పదని అభివర్ణించారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్ హేమంత్ పటేల్ వంశీ ముదిరాజ్, పలువురు భక్తులు సమాజ సేవకులు తదితరులు హాజరయ్యారు.

   -సిద్దుమారోజు