శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించండి

0
5

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్.   

 

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటాపురం డివిజన్ కానాజిగూడ వాసులు వారి కనజిగూడ బస్తీలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేయాలని, బస్తీలో నెలకొన్న సమస్యలు, త్రాగునీరు, పైపులైను వేయించాలని, స్పీడ్ బ్రేకర్లు వేయించాలని, బోర్వెల్ రిపేర్ చేయించాలని, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, రేషన్ కార్డులు ఇప్పించాలని, ఎమ్మెల్యే  దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే  సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో వీరేష్ సురేష్, కన్నా , సంతోష్ నిఖిల్ నాని అరుణ్, జమున, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

  -సిద్దుమారోజు