Friday, September 19, 2025
spot_img
HomeSouth ZoneTelanganaసికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రీడా పోటీలను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో క్రీడా పోటీలను ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

## *ప్రెస్ నోట్*##

## *03-08-2025* 

 

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / కంటోన్మెంట్

కంటోన్మెంట్ నియోజకవర్గంలోని జింఖానా గ్రౌండ్స్ లో నేడు మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి సారధ్యంలో నిర్వహిస్తున్న (Maa off season Telangana State Championship-) 2025 క్రీడా పోటీలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

30 సంవత్సరాలు పైబడిన పురుషులు మరియు మహిళలకు నిర్వహించే ఈ పోటీలలో పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులను ఆయన అభినందించారు. క్రీడలకు వయసుతో సంబంధం లేదని ఆరోగ్యవంతమైన జీవితానికి క్రీడలు ఆడటం చాలా మంచిదని దీనివల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరిక ఆరోగ్యం మరియు క్రీడా స్ఫూర్తి పెరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం పలు క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఆయన మెడల్స్ ప్రధానం చేశారు.ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

–సిద్దుమారోజు 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments