మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / కుత్బుల్లాపూర్
జగద్గిరిగుట్ట డివిజన్ 126 పరిధి బీరప్ప నగర్ టెంపుల్ రోడ్, జగద్గిరి నగర్ రోడ్ నెం.1 కాలనీలలో సుమారు 25.00 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. గత 12 ఏళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో కోట్లాది రూపాయల నిధులతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో కూడా కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, బీరప్ప నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు శేఖర్, సత్యనారాయణ యాదవ్, కోశాధికారి సుధాకర్, శ్రావణ్ కుమార్, కార్యనిర్వాహ కార్యదర్శిలు అనంతరెడ్డి, రామచంద్రయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
– సిద్దుమారోజు