సికింద్రాబాద్/ సికింద్రాబాద్.
చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఘరానా దొంగను అరెస్ట్ చేసిన సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు నిందితుడి నుండి 7.70లక్షల విలువైన 77గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. జీడిమెట్ల లో నివాసం ఉంటూ హెటెరోలో ఉద్యోగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందిన కొరిప్రోలు లవరాజు (23) చేడు వ్యాసనాలు, జల్సాలు, బెట్టింగులకు అలవాటు పడి దొంగతనాలు ప్రవృత్తిగా మార్చుకున్నాడని జీఆర్పీ డీఎస్పీ జావేద్ తెలిపారు. అందులో భాగంగా రద్దీగా ఉన్న సింహపురి ఎక్స్ ప్రెస్, గౌతమి ఎక్స్ ప్రెస్ రైళ్లలో దొంగతనాలకు రెండు చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి 77గ్రాముల బంగారం స్వాదినం చేసుకున్నట్లు వెల్లడించారు.
-sidhumaroju