మల్కాజ్గిరి జిల్లా/ ఎల్బీనగర్.
రాఖీ పండుగకు తన సొంత ఊరు బీహార్ కు వెళ్లి హైదరాబాదు నగరానికి తిరిగి వచ్చేటప్పుడు అక్రమంగా మూడు కంట్రీమేడ్ పిస్టల్స్ మరియు 10 రౌండ్ల లైవ్ బుల్లెట్లను తీసుకొని వచ్చి చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద నేరాలు చేసే వారికి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా మల్కాజ్గిరి ఎస్ ఓ టి మరియు చర్లపల్లి పోలీసులు శివకుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది.మరో నిందితుడు కృష్ణ పస్వాన్ పరారీలో ఉన్నాడు, మేడిపల్లి లోని ఒక ఫర్టిలైజర్ కంపెనీలో లేబర్గా పనిచేసే నిందితుడు శివకుమార్ ఈజీ మనీ కోసం తన సొంత ఊరిలో ఉన్న బంధువు కృష్ణ పస్వాన్ ఈ అక్రమ మారనాయుధాల రవాణా పథకం వేసి హైదరాబాదు నగరానికి తీసుకురావడం జరిగిందని, నిందితుడు శివకుమార్ ఈ వెపన్స్ ను చర్లపల్లి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతూ అమ్మడానికి ప్రయత్నిస్తుండగ పోలీస్ లు పట్టుకోవడం జరిగింది. గతంలో శివ కుమార్ ఎన్ డి పి ఎస్ యాక్ట కింద అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియాకు తెలిపారు.
– sidhumaroju