భారీ వర్షానికి పంటలు పాడయ్యాయి. అప్పులు తెచ్చి సాగు చేపడితే ఏకదాటి వర్షానికి నేలకొరిగాయి . గత ఎనిమిది రోజుల గా గ్రామాలలో వర్షాలు కురిశాయి . ఈ క్రమంలో ఉల్లి. మిరప. టమేటా పంటల్లో నీరు చేరాయి. దీంతో పంట నష్టపోయామని ఓ రైతు తెలుగు తిమ్మప్ప ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షానికి సర్వనాశనమైంది. దాదాపు 2 ఎకరాల్లో ఉల్లి . రెండు ఎకరాల టమేటా 2 రెండు ఎకరాల. చెవుల కాయ .పంట నష్టం వాటిల్లింది. లక్షల్లో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన ఉల్లిగడ్డలు . టమేటా కుళ్లిపోవడంతో పొలాల్లోనే పశువుల మేతకు వదిలేసే దుస్థితి నెలకొంది.మరి ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లి… కన్నీరు పెట్టిస్తోంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వారం రోజులగా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్న ఉల్లి రైతు ను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.