నగర పంచాయతీ నందు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చైర్మన్ జే వెంకటేశ్వర్లు కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ
ప్రతి ఏడాది ఆగస్టు 15 స్వతంత్ర వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79 వ సంవత్సరానికి అరుగుపెడుతున్నందుకు మనందరికీ ఎంతో గర్వకారణమైన రోజు. ఎందుకంటే ఆరోజే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, ఎన్నో త్యాగాలు, బలిదానాలు చేసి భారత దేశానికి విముక్తి పొందిన రోజు. 1947 ఆగస్టు 15న మన దేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛను పొందింది. మనకు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన స్వేచ్ఛ కోసం ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకునే పవిత్ర సందర్భం.హింసతో స్వాతంత్య్రం సాధ్యం కాదు అని మహాత్మా గాంధీ అహింస మార్గంలో ఉద్యమం ప్రారంభించారు, ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తువుల బహిష్కరణ, సహాయ నిరాకరణ కార్యక్రమాల ద్వారా బ్రిటీషు వారిని ఎదురించారు. సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లబాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, జవహర్ లాల్ నెహ్రు ఇలా ఎంతోమంది పోరాట ఫలితమే మన స్వాతంత్య్రం. మనం గుర్తించని స్వాతంత్ర సమరయోధులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. మన కోసం మన స్వేచ్ఛ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన వారిని ఈ ఒక్క రోజు గుర్తు చేసుకోవడం కాదు, వారి పోరాట స్పూర్తితో మన దేశాన్ని (ఇండిపెండెన్స్ డే అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుందాం. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మునిసిపల్ సిబ్బంది శానిటరీ సిబ్బంది. మెప్మా సిబ్బంది ప్రజలు భారీగా పాల్గొన్నారు