Sunday, August 17, 2025
spot_img
HomeSouth ZoneTelanganaభక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.

భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.

మల్కాజిగిరి జిల్లా/ అల్వాల్.     శ్రీకృష్ణుని జననం ఆయన జీవితమంతా ఓ అద్భుతం. యుగయుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవజాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది. ఉత్తర ప్రదేశ్ లోని మధురలో శ్రీకృష్ణుడు జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవ రాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వల్ల ఆయన కుమారుడు కంసుడు అత్యాశతో ఉగ్రసేన  మహారాజుని చెరసాలలో బంధించి రాజ్యాధికారం చేపడుతాడు. మరోవైపు కంసుడి చెల్లెలు అయిన దేవకి మరొక యాదవ రాజు అయిన వసుదేవుని వివాహం చేసుకుంటుంది. పెళ్లయిన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకెళ్తున్నప్పుడు..ఆకాశవాణి, ఓ కంసా..! నీ పాపం పండే రోజులు దగ్గరపడ్డాయి.  నీ చెల్లెలి పెళ్లి తర్వాత ఆమెను ఆనందంగా తీసుకెళ్తున్నావు, నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ శిశువు నిన్ను వధిస్తాడు.. అదే నీ అంతం అని చెబుతుంది. అది విని ఒక్కసారిగా కంసుడు ఉగ్రరూపం ధరిస్తాడు. ఓహో..! ఆమె ఎనిమిదవ సంతానం నన్ను వధిస్తుందా? నేను ఇప్పుడే ఆమెను చంపేస్తాను. ఆమె చనిపోయాక ఇక ఎలా శిశువు జన్మిస్తుంది!  అంటూ దేవికిని చంపబోతాడు. అప్పుడు పెళ్ళికొడుకైన వసుదేవుడు కంసుని అర్థిస్తాడు.  మాకు జన్మించే ఎనిమిదవ సంతానమే కదా నిన్ను వధించేది. నేను మాకు పుట్టిన శిశువులందరినీ నీకు అప్పగిస్తాను. అప్పుడు నీవు వాళ్లని చంపవచ్చు. దయచేసి నా భార్యని వదిలిపెట్టు, అంటూ కంసునితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో దేవకి వసుదేవులను గృహ నిర్బంధంలో ఉంచి వారికి కాపలా ఏర్పాటు చేస్తాడు. మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసునికి తెలియజేస్తారు. కంసుడు రాగానే దేవకి వసుదేవులు నిన్ను వదించేది మా ఎనిమిదో సంతానం కదా.. ఈ బిడ్డను వదిలేయి అని ఎంతోగానో ప్రాధేయపడతారు. కంసుడు వాళ్ళ వేదనాభరితమైన మాటలను పట్టించుకోకుండా పుట్టిన శిశువును రాతి బండకేసి కొట్టి చంపేస్తాడు. ప్రతిసారి ఒక శిశువు జన్మించడం పుట్టిన ప్రతి వాళ్లను కంసుడు ఇలానే చంపడం జరుగుతుంది. ఎనిమిదో శిశువు బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది.. కారాగారం తలుపులు వాటంత అవే తెర్చుకుంటాయి. కాపలా వాళ్ళందరూ నిద్రలోకి జారిపోతారు. వసుదేవుని సంకెళ్లు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. వెంటనే వసుదేవుడు ఆ శిశువుని ఎత్తుకొని ఎవరో చెబుతున్నట్టుగా యమునా నది తీరం వైపు నడుస్తాడు. యమునా నది ఉదృతంగా  ప్రవహిస్తున్న ఆశ్చర్యకరంగా నది రెండుగా చీలి వసుదేవునికి దారినిస్తుంది. వసుదేవుడు నదిని దాటి నంద, యశోద ఇంటికి వెళతాడు. యశోద అప్పటికే ఒక ఆడ శిశువుకి జన్మనిస్తుంది.ఆ ప్రసవం కష్టం కావడంతో ఆమె స్పృహ కోల్పోతుంది. వెంటనే వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తన కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. వెంటనే మేలుకున్న కాపలా వాళ్ళు ఈ విషయం కంసునికి తెలియజేస్తారు.  అనుమానంతో కాపలా వాళ్లను ప్రశ్నిస్తాడు. అప్పుడు వాళ్లు భయంతో  తామంతా చూసామని ఆడపిల్లనే జన్మించిందని చెబుతారు. ‘ఇది ఒక ఆడపిల్ల.. నిన్ను ఎలా చంపగలదు’ వదిలి పెట్టమని దేవకి వసుదేవులు  కంసుని ఎంతో ప్రాధేయపడతారు. కానీ కంసుడు కనుకరించక ఆ శిశువు  కాళ్లు పట్టుకొని నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆశిశువు కంసుని చేతిలోంచి ఎగిరిపోతూ, “కంసా.. నిన్ను చంపబోయి శిశువు మరో చోట పెరుగుతుంది”. అని చెప్పి మాయమవుతుంది. ఆ విధంగా గోకులంలో చేరిన శ్రీకృష్ణుడు రాజు కొడుకే అయినా ఒక సాధారణ గోవుల కాపరిగానే పెరుగుతాడు. శ్రీమహావిష్ణువు ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే నేడు శ్రీ కృష్ణాష్టమి గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా టెంపుల్ అల్వాల్ లో  శ్రీకృష్ణ ఆలయం లోని శ్రీకృష్ణుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైన తులసిమాలతో పాటు రకరకాల పూలమాలలు అలంకరించిన ఆయన రూపాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుని  అటుకులు బెల్లంతో కూడిన తీర్థప్రసాదాలు తీసుకుని ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. 

  – sidhumaroju 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments