మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: అల్వాల్. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ప్రజా యోధుడు, సామాజిక సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన స్వర్గీయ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ జయంతి వేడుకలు అల్వాల్‌లో ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, వేమూరి సాయిరాం గౌడ్‌తో కలిసి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజల జీవితాలను వెలుగులోకి తెచ్చే కృషి చేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి, కృష్ణ గౌడ్, లక్ష్మీకాంతరెడ్డి, సూర్య కిరణ్, రాజసింహారెడ్డి, నాగేశ్వరరావు గౌడ్, సంఘ నాయకులు పాల్గొన్నారు.
ఇక బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కూడా పాపన్న గౌడ్ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ సీనియర్ నాయకుడు మల్లికార్జున గౌడ్, కార్తీక్ గౌడ్, శ్రీనివాస్, లక్ష్మణ్, మహేందర్ రెడ్డి, అనిల్ యాదవ్, రవికిరణ్, ముయ్యి సుజాత, కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.
– sidhumaroju