పేరుకే నగర పంచాయతీ అభివృద్ధి మాత్రం నోచుకోవడం లేదు, వర్షం వస్తే చాలు కంప్యూటర్లు,ఫైళ్లను మూత వేయాల్సిందే మరి, గూడూరు లో 70 నుంచి 80 సంవత్సరాలు క్రితం నిర్మించిన నగర పంచాయతీ భవనం పెంకులు పగిలిపోయి వర్షం వస్తే ముఖ్యమైన కంప్యూటర్ లు ఫైళ్లన్నీ తడిసిపోతు న్నాయి.
నేటికీ ఈ గూడూరు నగర పంచాయతీ గా నడుస్తున్నది,కాలం చెల్లిన భవనాలను చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది ఉద్యో గులు ఆయా ఆఫీస్ ల్లో విధులు నిర్వహిస్తుంటారు. ఓ మోస్తరు వర్షం పడినా.. ఆయా కార్యాలయాల్లోని శ్లాబులు, పెంకులూడి పడటం సర్వ సాధారణంగా
మారుతుంది. ఇక వర్షం వస్తే నీరంతా ఆఫీస్.లోకి చేరడం మొదలవుతుంది . వర్షం నీటి లీకులు, తడిచిపోయి చెమ్మతో ఉన్న గోడల కారణంగా కలప, గోడలు దెబ్బతిని ఎప్పు డూ ఇదే ఫైళ్లను నానిపోతాయి అన్న భయంతో అధికారులు, మరి 15 సంవత్సరాల కిందట నగర పంచాయతీ నూతన నిర్మాణం చేపట్టారు కానీ మధ్యలో ఆపేశారు నాయకులు మారింది నూతన భవనం పూర్తి కాలేదు 70 నుంచి 80 సంవత్సరాల పాత నగర పంచాయతీ ఆఫీస్ ఎటువంటి మరమ్మతులకు నోచుకోని భవనాల్లోనే అనేక ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయి.ఓకే ఆఫీసులో సచివాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది సంబంధిత అధికారులు విస్మరించటంతో వసతులు లేక సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా నూతన నగర పంచాయతీ కట్టించి ఇటు అధికారులకు అటు ప్రజలకు మేలు కలుగుతుందని ఆశిస్తున్నాను