మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా :అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్‌లో ఉన్న పొలిమేర షాప్‌లో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షాప్ యాజమాన్యం గత రెండు నెలలుగా అక్కడ పని చేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అందులో పనిచేస్తున్న మహిళలు ఒక్కొక్కరు రూ.12,000 చొప్పున పది మంది కార్మికులు తమ వేతనాలు పొందలేదని బాధతో తెలిపారు. జీతాలు ఇవ్వకపోవడంతో నిరాశకు గురైన బాధితులు చివరికి పోలీసులను ఆశ్రయించారు. స్థానికులు యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కార్మికుల కష్టానికి తగిన వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
@sidhumaroju