మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్‌లోని వెంకటాపురం డివిజన్‌కు చెందిన ఓ సీనియర్ సిటిజన్ ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో “షుగర్ సెన్సెస్ ప్రో హై ప్రొసీజర్ మానిటరింగ్ డివైస్ – హాట్ డీల్, బై వన్ గెట్ వన్ ఫ్రీ” అనే ప్రకటన చూసి ఆర్డర్ పెట్టారు. ఆ ప్రకటనలో 80,000 మంది సంతృప్తి చెందిన కస్టమర్లు ఉన్నారని చెప్పడంతో నమ్మి ఆర్డర్ చేసిన సీనియర్ సిటిజన్, వచ్చిన కొరియర్ తెరవగానే షాక్‌కు గురయ్యారు. డివైస్ బదులుగా రెండు సబ్బు బిళ్లలు, పేపర్ ప్లేట్స్ కాయలు మాత్రమే పంపించారు. ఈ ఘటనతో బాధితుడు తీవ్రంగా ఆందోళన చెందగా, ఇతరులు ఇలాంటి మోసపూరిత ఆన్‌లైన్ ప్రకటనలకు బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులు కూడా ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
– sidhumaroju