సిపిఎం)కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు ఆలంబిస్తున్న విద్యుత్ సంస్కరణలకు, స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా పోరాడుతామని సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి
జే ,మోహన్ అన్నారు,విద్యుత్ పోరాట అమర వీరుల సంస్కరణ సభ సందర్భంగా విద్యుత్ సంస్కరణలకు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, సర్ చార్జీల పేరుతో అధిక వసూళ్లకు వ్యతిరేకంగా పోరాడుతామని గూడూరు బస్టాండ్ లో సిపిఎం పార్టీ ఆధ్వరంలో సిపిఎం నాయకులు ప్రతిజ్ఞ చేయడం జరిగింది,ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి
జే ,మోహన్ మాట్లాడుతూ…. 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన నాటి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను చేసి విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తే, విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా హైదరాబాద్ బషీరాబాద్ లో వామపక్షా పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయని, ఆ పోరాటంలో ముగ్గురు(రామకృష్ణ,బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి,) మరణించారని, నేటికీ 25 సంవత్సరాలు పూర్తయిందని,, చనిపోయిన వారి పోరాట వలన 20 సంవత్సరాల వరకు ఏ ప్రభుత్వాలు కూడా విద్యుత్ సంస్కరణలు చేయడానికి సాహసించలేదని,, గత వైసిపి ప్రభుత్వం సర్చార్జీలు, ట్రూ ఆఫ్ చార్జీలు, ఇలా రకరకాల చార్జీల పేరుతో ప్రజలపై అధిక విద్యుత్ భారాలు వేసి వసూలు చేసిందని,, ఈ విద్యుత్ బారాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, దీంతోపాటు అదాని కంపెనీతో ఒప్పందం చేసుకొని విద్యుత్తును అదాని కంపెనీకి ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నదని, అందులో భాగంగా స్మార్ట్ మీటర్లు బిగించడానికి ప్రయత్నాలు చేసిందని, అందుకే ప్రజలు వైసిపి ప్రభుత్వం ఇంటికి పంపించిందని, నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా విద్యుత్ సర్చార్జిలను తగ్గిస్తుందేమోనని ఆశపడ్డ ప్రజలకు అడియాశలే మిగిల్చిందని, ఈ కూటమి ప్రభుత్వం కూడా విద్యుత్తును అదాని కంపెనీకి అప్పగించడానికి ప్రయత్నిస్తున్నదని, అందులో భాగంగానే విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఇండ్లకు బిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నదని, ప్రభుత్వాలు మారిన ప్రజలపై విద్యుత్ ద్వారాలు మాత్రం తగ్గడం లేదని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలం తగ్గించి స్మార్ట్ మీటర్లను రద్దు చేయకపోతే 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన అమరవీరుల పోరాట స్ఫూర్తితో సిపిఎం పార్టీగా ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు,,,కార్యక్రమంలో సిపిఎం నాయకులు దానమన్న, కొమ్మురాజు, కృప, నాగేష్, సురేష్, చిన్న రాజు, హమాలి సంఘం నాయకులు చిరంజీవి, పెద్ద సుధాకర్, ప్రభుదాస్, ఏసేపు, అబ్రహం, చిన్న సుధాకర్, సురేష్, కోళ్ల రవి, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు,,