గూడూరు పట్టణానికి చెందిన సీనియర్ టిడిపి
నేత, మాజీ పట్టణ అధ్యక్షుడు కడియాల బోయ గజేంద్ర గోపాల్ నాయు డు భారతీయ జనతా పార్టీలు చేరారు. శనివారం విజయవా డలోని నోవాటెల్ హెూటల్లో నిర్వహించిన అర్థ సంచార జాతుల సమావేశంలో గజేంద్ర గోపాల్ నాయుడు, గూడూరు టీడీపీ నేతలు శరత్ కుమార్, సింగని గేరి శ్రీనివాసులు, కే దివ్యరాణిలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎస్ మాధవ్ బీజేపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. టిడిపి పార్టీలో ఎన్నో అవమానాలకు గురై ఆర్థికంగా కూడా నష్టపోయినప్పటికీ టిడిపిలో గుర్తింపు దక్కకనే బిజెపిలో చేరినట్లు గజేంద్ర గోపాల్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, జాతీయ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.